వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌ను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు అధికారులు సమష్టిగా కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం కలెక్టరేట్‌లో నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, డ్రగ్స్ విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. హాస్టళ్లు, రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేసినట్లు అడిషనల్ డీసీపీ వెంకటరమణ తెలిపారు.
Comments
Loading comments...

