Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే బోనెల అభినందనలు

Follow Udayam on Google
B Ganga Aug 23, 2026 9:33 PM పార్వతీపురం మన్యంGeneral
డీఎస్సీ విజేతలకు ఎమ్మెల్యే బోనెల అభినందనలు - Udayam
డీఎస్సీ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులపై అసత్య ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం కోటవానివలసకు చెందిన యేటూరి రవికుమార్ 2025 డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ (సోషల్)గా ఎంపిక కావడంతో ఆయన స్వగృహానికి వెళ్లి అభినందించారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన యువతకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దుష్ప్రచారాలను పట్టించుకోకుండా విధుల్లో రాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...