Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని వినతి

Follow Udayam on Google
B Ganga Sep 10, 2026 7:02 PM పార్వతీపురం మన్యంGeneral
డిగ్రీ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని వినతి - Udayam
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని మక్కువ, కొమరాడ, పాచిపెంట మండల కేంద్రాల్లో కళాశాల విద్యార్థుల కోసం ప్రభుత్వ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఎ నాయకులు సింహాచలం, అనిల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఐటీడీఏ ఇన్ఛార్జ్ డీడీ చంద్రబాబుకు వినతిపత్రం అందజేశారు. వసతి గృహాలు లేకపోవడంతో గిరిజన, పేద విద్యార్థులు రవాణా ఖర్చులు భరించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...