Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘100 శాతం’ క్లెయిమ్‌లపై డాబర్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 04, 2026 1:46 PM జాతీయంGeneral
‘100 శాతం’ క్లెయిమ్‌లపై డాబర్‌కు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు - Udayam
ఆహార ఉత్పత్తులపై ‘100 శాతం’ అంటూ తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లు చేయడంపై డాబర్ ఇండియాపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చర్యలు తీసుకుంది. తేనె, నెయ్యి, ఎడిబుల్ ఆయిల్స్‌ తదితర ఉత్పత్తుల విక్రయాలపై నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. ‘100 శాతం నేచురల్’, ‘100 శాతం ప్యూర్’ వంటి లేబులింగ్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. నోటీసు అందిందని, అందులోని అంశాలను పరిశీలిస్తున్నామని డాబర్ వెల్లడించింది.

Comments

G
Loading comments...