Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫుడ్ డెలివరీ యాప్స్‌కు సైబరాబాద్ కమిషనర్ హెచ్చరిక

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 15, 2026 11:43 AM హైదరాబాద్General
ఫుడ్ డెలివరీ యాప్స్‌కు సైబరాబాద్ కమిషనర్ హెచ్చరిక - Udayam
ప్రజారోగ్యం దృష్ట్యా నాణ్యతలేని, లైసెన్స్ లేని హోటళ్లను ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ నుండి తొలగించాలని స్విగ్గీ, జొమాటోలకు సైబరాబాద్ కమిషనర్ జి.సృజన నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా నమోదిత హోటళ్ల జాబితాను సమర్పించాలని ఆదేశించారు. ఇకపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, జీహెచ్‌ఎంసీ లైసెన్స్ ఉన్న సంస్థలను మాత్రమే అనుమతించాలని, గూగుల్ లొకేషన్‌తో సహా పూర్తి చిరునామాలు స్పష్టంగా ఉండాలని కమిషనర్ స్పష్టం చేశారు. నాణ్యత లేని వంటశాలలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...