Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్లామాబాద్‌లో సైబర్‌ మోసాలు.. 258 మంది అరెస్ట్‌

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 4:46 PM జాతీయంGeneral
ఇస్లామాబాద్‌లో సైబర్‌ మోసాలు.. 258 మంది అరెస్ట్‌ - Udayam
పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో అక్రమ కాల్‌ సెంటర్‌ నిర్వహిస్తూ సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న 258 మంది విదేశీయులను ఎఫ్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో 41 మంది చైనీయులు ఉన్నట్లు ఎఫ్‌ఐఏ డీజీ ఉస్మాన్‌ అన్వర్‌ తెలిపారు. సోషల్‌ మీడియా యాప్‌లలో మహిళలుగా నటిస్తూ అధిక లాభాల పేరుతో పెట్టుబడి మోసాలకు పాల్పడినట్లు వెల్లడించారు. అరెస్టయిన వారిపై విదేశీయుల చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...