Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కెరమెరిలో సీఆర్‌టీ పీడీ మిస్సింగ్

Follow Udayam on Google
Anuroop Sep 26, 2026 9:43 AM ఆసిఫాబాద్General
కెరమెరిలో సీఆర్‌టీ పీడీ మిస్సింగ్ - Udayam
కెరమెరి మండలం కొత్తగూడకు చెందిన జోడేఘాట్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సీఆర్‌టీ పీడీగా పనిచేస్తున్న వ్యక్తి అదృశ్యమయ్యారు. ఈ నెల 23న సెలవు పెట్టి ఆదిలాబాద్ వెళ్లిన ఆయన, తిరుగు ప్రయాణంలో సాయంత్రం 7 గంటల సమయంలో కెరమెరి ప్రాంతంలో కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రాజు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...