వార్తలకు తిరిగి వెళ్లండి

నాయి బ్రాహ్మణుల కులవృత్తి పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని మండల అధ్యక్షుడు తోటపల్లి రమణ డిమాండ్ చేశారు. చర్ల మండల కేంద్రంలో బుధవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం 500/82 ఆధ్వర్యంలో నిర్వహించిన దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
నాయి బ్రాహ్మణుల క్షౌరవృత్తి తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయ వృత్తి అని తెలిపారు. వృత్తిని పరిరక్షించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

