Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ షాక్‌తో దంపతుల దుర్మరణం

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 14, 2026 12:28 PM కోనసీమGeneral
విద్యుత్ షాక్‌తో దంపతుల దుర్మరణం - Udayam
విజయవాడ కనకదుర్గ నగర్ వద్ద హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఇటికాయలపల్లెకు చెందిన సింహాచలం, వెంకటరమణ దంపతులు మృతిచెందారు. గురువారం వాటరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు. ఈ క్రమంలో హైటెన్షన్ వైర్లు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. మృతురాలి తమ్ముడు హరికృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు.

Comments

G
Loading comments...