Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోరగుడిలో అంగన్‌వాడీ కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 2:19 PM కృష్ణా జిల్లాGeneral
చోరగుడిలో అంగన్‌వాడీ కార్యక్రమం - Udayam
చోరగుడి-3 అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం ‘అంగన్‌వాడీ ఉత్సవ్‌-సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహించారు. పోషణ్‌ మాసోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 7 వరకు కార్యక్రమాలు చేపడుతున్నారు. అక్టోబర్‌ 1 నుంచి 3 వరకు గర్భిణులు, బాలింతలు, చిన్నారుల తల్లులకు పోషకాహారం, మాతృవందన యోజన, పిల్లల ఆరోగ్యం, విద్యా సదుపాయాలపై అవగాహన కల్పించారు. హెచ్‌ఎం ఎన్‌. వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...