Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చోడవరం ఫిషర్‌మెన్‌ కాలనీలో స్వచ్ఛత పనులు

Follow Udayam on Google
Udayam Desk Sep 09, 2026 12:12 PM అనకాపల్లి General
చోడవరం ఫిషర్‌మెన్‌ కాలనీలో స్వచ్ఛత పనులు - Udayam
చోడవరం ఫిషర్‌మెన్‌ కాలనీలో బుధవారం ‘స్వచ్ఛ పదం చోడవరం’ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో రాజు, ఈవో గంగాధర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నారాయణరావు ఆధ్వర్యంలో రోడ్ల వెంట పిచ్చిమొక్కలు, కాలువల్లో పూడికను తొలగించారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. రోడ్లు, కాలువల్లో చెత్త వేయకుండా ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...