Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ ధర్నా

కౌశిక్ శర్మ Jul 23, 2026 3:07 PM నల్గొండabout 1 hour ago
రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జీలతో కాంగ్రెస్ ధర్నా - Udayam Digital
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ నల్గొండ జిల్లా గట్టుప్పుల్‌లో ఆ పార్టీ నేతలు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వీరముల్ల శ్రీశైలంగౌడ్ ఆదేశాల మేరకు ఈ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు రావుల రమేష్, సర్పంచ్ జగన్నాథం, నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...