వార్తలకు తిరిగి వెళ్లండి

24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్ కేటీదొడ్డి మండల నాయకుడు గాజుల కృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ వర్షాభావంతో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు.
విద్యుత్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. రైతు సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని విమర్శిస్తూ 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

