Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.3 లక్షలు తిరిగిచ్చిన కండక్టర్‌

Follow Udayam on Google
Sai Sep 07, 2026 7:17 PM హైదరాబాద్General
రూ.3 లక్షలు తిరిగిచ్చిన కండక్టర్‌ - Udayam
హైదరాబాద్‌లో హజ్‌కు వెళ్తున్న దంపతులు బస్సులో మర్చిపోయిన రూ.3 లక్షల నగదును టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్‌ సరిత తిరిగిచ్చారు. అఫ్జల్‌గంజ్‌లో దిగిన తర్వాత నగదు బ్యాగ్‌ మర్చిపోయినట్లు గుర్తించిన జహంగీర్‌ తిరిగి బస్‌స్టాండ్‌కు వచ్చారు. బ్యాగ్‌ను గుర్తించిన సరిత.. డ్రైవర్‌ నరసింహులుతో కలిసి నగదును భద్రపరిచి యజమానికి అప్పగించారు. సరిత నిజాయితీని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అభినందించారు.

Comments

G
Loading comments...