వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 15లోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి జగన్‌మోహన్‌రావు సూచించారు. జిల్లాలో 3,55,331 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 3,27,640 మంది ఈకేవైసీ పూర్తి చేశారని తెలిపారు.
ఇంకా 25,671 మంది ఈకేవైసీ పూర్తి చేయాల్సి ఉందన్నారు. గడువులోగా గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని వినియోగదారులను కోరారు.
Comments
Loading comments...

