Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృతురాలి ఆభరణాలు కనిపించడంలేదని ఫిర్యాదు

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Aug 13, 2026 2:26 PM విశాఖపట్నంGeneral
మృతురాలి ఆభరణాలు కనిపించడంలేదని ఫిర్యాదు - Udayam
గాజువాకలో ప్రమాదంలో మృతిచెందిన నామాల ప్రభావతి బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయని కుటుంబ సభ్యులు క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈనెల 6న ఫార్మా బస్సు ఢీకొనడంతో 32 ఏళ్ల ప్రభావతి మృతిచెందారు. పోస్టుమార్టం అనంతరం ఆమె వద్ద ఉన్న గొలుసు, ఉంగరాలు కనిపించలేదని బంధువులు ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ క్రైమ్ బ్రాంచ్ సీఐ జీడీ బాబు తెలిపారు.

Comments

G
Loading comments...