వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో ఎనిమిది మంది మరణించడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారంతో పాటు ఉద్యోగం ఇస్తామని, గాయపడిన వారికి రూ.10 లక్షల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించారు.
ఈ ప్రమాదంపై కమిటీ విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడమే తమ ప్రధాన సంకల్పమని, కార్మికుల సమస్యలను త్వరలోనే అడిగి తెలుసుకుంటామని పవన్ భరోసా ఇచ్చారు.
Comments
Loading comments...

