Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసైన్డ్‌ భూములకు త్వరలో పరిహారం

Follow Udayam on Google
Sai Nath Sep 28, 2026 2:37 PM అనకాపల్లి General
అసైన్డ్‌ భూములకు త్వరలో పరిహారం - Udayam
రాంబిల్లి మండలం గోరపూడి పంచాయతీ పరిధిలో APIIC సేకరిస్తున్న అసైన్డ్‌ భూములకు త్వరితగతిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఏపీఆర్‌డీసీ ఛైర్మన్‌ ప్రగడ నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. సోమవారం రైతులు, అధికారులతో జరిగిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు. భూముల్లోని పెద్ద మొక్కలను రైతులే తొలగించుకోవాలని, చిన్న మొక్కలకు నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. సమస్యను త్వరగా పరిష్కరిస్తామని ప్రగడ తెలిపారు.

Comments

G
Loading comments...