Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సర్టిఫికెట్లు ఆపితే కాలేజీల గుర్తింపు రద్దు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 18, 2026 10:18 AM హైదరాబాద్General
సర్టిఫికెట్లు ఆపితే కాలేజీల గుర్తింపు రద్దు - Udayam
ఫీజు బకాయిల నెపంతో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను ఆపితే ప్రైవేట్ కాలేజీల గుర్తింపును రద్దు చేస్తామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. విద్యార్థులకు తక్షణమే టీసీ, బోనఫైడ్, కండక్ట్ సర్టిఫికెట్లను అందజేయాలని యాజమాన్యాలను స్పష్టంగా ఆదేశించింది. ప్రస్తుతం ఉన్నత విద్యా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోందని బోర్డు గుర్తుచేసింది. ఈ సమయంలో సర్టిఫికెట్లు ఇవ్వకపోతే విద్యార్థుల విద్యా సంవత్సరం దెబ్బతింటుందని, వారి భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని పేర్కొంది.

Comments

G
Loading comments...