Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గంపహాడ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Follow Udayam on Google
Harika Jun 22, 2026 6:40 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
బూర్గంపహాడ్‌లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు - Udayam
జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం బూర్గంపహాడ్ మండలంలో పర్యటించి గురుకుల పాఠశాల, ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. పాఠశాలలో భోజన నాణ్యత, మెనూ అమలు, పరిశుభ్రతపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎరువుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, రైతులకు నిర్ణీత ధరలకే ఎరువులు విక్రయించాలని డీలర్లను హెచ్చరించారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...