Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాలలు, హాస్టళ్లలో భద్రతపై కలెక్టర్ ఆదేశాలు

Follow Udayam Digital on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 6:00 PM అనకాపల్లి ఆంధ్రప్రదేశ్
పాఠశాలలు, హాస్టళ్లలో భద్రతపై కలెక్టర్ ఆదేశాలు - Udayam Digital
అనకాపల్లి జిల్లాలో పాఠశాలలు, కాలేజీలు, హాస్టళ్లలో విద్యార్థుల భద్రత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె ఈ సూచనలు చేశారు. అడ్మిషన్లు పెంచాలని, ఆరోగ్య పరీక్షలు, కాచి చల్లార్చిన నీరు, నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. హాస్టళ్లలో వార్డెన్లు ఉండాలని, మాదకద్రవ్యాలు రాకుండా నిఘా ఉంచాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...