Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల సీట్ల పేరుతో వసూళ్లు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Jul 31, 2026 11:10 AM జగిత్యాలGeneral
గురుకుల సీట్ల పేరుతో వసూళ్లు - Udayam
బీసీ గురుకులాల్లో ప్రవేశాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు సీటుకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేద కుటుంబాలనే లక్ష్యంగా చేసుకుని డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రత్యేక ప్రవేశాల విధానాన్ని ఆసరాగా చేసుకుని అక్రమాలు జరుగుతున్నాయనే ప్రచారం ఉంది. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

G
Loading comments...