Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొట్టుకుపోయిన గొల్లపల్లి వంతెన

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 9:47 AM అల్లూరి General
కొట్టుకుపోయిన గొల్లపల్లి వంతెన - Udayam
తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు అల్లూరి జిల్లా జీకే వీధి మండలంలో గొల్లపల్లి-చామగెడ్డ మధ్య వంతెన గురువారం ఉదయం కొట్టుకుపోయింది. కాలువలు పొంగి ప్రవహిస్తుండటంతో వరద ఉద్ధృతికి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో వంచుల, అమ్మవారి దారకొండ పంచాయతీల పరిధిలోని సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

Comments

G
Loading comments...