Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చందుర్తిలో 50 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
C. Rakesh Sep 26, 2026 11:31 AM రాజన్న సిరిసిల్లGeneral
చందుర్తిలో 50 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మండల పరిధిలోని గుడిసెల్లో నివసిస్తున్న సుమారు 50 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. అలాగే అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...