వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఈ నెల 5న జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ను వీడియో రికార్డింగ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆరు మండలాల్లోని ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
నామినేషన్ల సమయంలో జరిగిన దాడులు, అక్రమాలపై దాఖలైన పిటిషన్ మేరకు కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. రికార్డు చేసిన ఫుటేజీని భద్రపరిచి కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.
Comments
Loading comments...

