Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

Follow Udayam on Google
మానస శర్మ Aug 06, 2026 6:25 PM ములుగు General
సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ - Udayam
జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత్ బోర్కడే అధికారులను ఆదేశించారు. ఎస్పీ సుధీర్ కేకన్‌తో కలిసి నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై సూచనలు చేశారు. అన్ని పనులను 12వ తేదీలోగా పూర్తి చేసి, సమన్వయంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సీఎం మేడారం వనదేవతలను దర్శించుకునే నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...