వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలోని హత్యాయత్నం కేసులో బొమ్మిడి రాంబాబు, బొమ్మిడి వీరలక్ష్మికి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది.
2020 నవంబర్ 16న ఉండూరు గ్రామంలో దుస్తులు ఆరబెట్టే విషయంలో వివాదం తలెత్తి బాధితులపై నిందితులు దాడి చేసినట్లు కేసు నమోదైంది. నాల్గవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు.
Comments
Loading comments...

