వార్తలకు తిరిగి వెళ్లండి

కడెం ప్రాజెక్టు పరిధిలోని చివరి ఆయకట్టు పొలం వరకు సాగునీరు అందేలా చూడాలని లక్షెట్టిపేట మండలంలోని పలు గ్రామాల రైతులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం కడెం ప్రాజెక్టు నుండి సాగు నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఎడమ కాలువకు 533, కుడికాలువకు 9 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కెనాల్ ద్వారా 700 క్యూసెక్కుల నీరు అందిస్తేనే చివరి ఆయకట్టుకు సాగునీరు అందుతుందని రైతులు వెల్లడించారు.
Comments
Loading comments...

