Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి

Follow Udayam on Google
saychi kumar Aug 19, 2026 1:09 PM కామరెడ్డిGeneral
చిరుత పులి దాడిలో లేగ దూడ మృతి - Udayam
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని పి.పిరుమయకుంట తండా సమీపంలో చిరుత పులి దాడిలో జాదవ్ సంతోష్కు చెందిన లేగ దూడ మృతి చెందిందని స్థానికులు బుధవారం తెలిపారు. రెండు రోజులుగా కనిపించకుండా పోయిన దూడ కోసం సంతోష్ కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంతో పాటు తండా శివారులో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మేకల కాపరులు ఇచ్చిన సమాచారంతో వెళ్లి చూడగా చిరుత పులి దాడిలో దూడ మృతి చెందినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...