Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతాడపేటలో శ్రీకృష్ణుని ఊయలసేవ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 05, 2026 12:06 AM శ్రీకాకుళంGeneral
చింతాడపేటలో శ్రీకృష్ణుని ఊయలసేవ - Udayam
​పోలాకి మండలం చింతాడపేటలో వెలసి ఉన్న శ్రీ రామయోగి బాబా సేవాశ్రమంలో శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి సామూహిక భగవద్గీత పారాయణం, భజనలు, యజ్ఞాలు చేసిన అనంతరం శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఊయలలో వేసి ఊయలసేవ ప్రత్యేకంగా నిర్వహించారు. సత్సంగ సభ అధ్యక్షుడు బొమ్మిడి విశ్వనాథం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...