Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నశంకరంపేటలో దట్టమైన పొగమంచు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 10:55 AM మెదక్General
చిన్నశంకరంపేటలో దట్టమైన పొగమంచు - Udayam
చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు అలుముకుంది. రహదారిపై మంచుదుప్పటి కమ్మేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలువురు వాహనాలకు లైట్లు వేసుకుని ప్రయాణించారు. రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను మంచు కమ్మేయడంతో ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. పొగమంచుతో ఉదయం వేళ రహదారులు మసకబారాయి.

Comments

G
Loading comments...