Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపాలని సూచన

Follow Udayam on Google
p.g.murthy Sep 16, 2026 3:26 PM మంచిర్యాలGeneral
చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు పంపాలని సూచన - Udayam
చిన్నారులను అంగన్వాడి కేంద్రాలకు తల్లిదండ్రులు పంపాలని దండేపల్లి ఐసిడిఎస్ సూపర్వైజర్ మమత కోరారు. బుధవారం దండేపల్లిలోని మేదరిపేటలో అంగన్వాడి కేంద్రం-1లో పోషణ మాసం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహార విశిష్టతపై అవగాహన కల్పించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, ఆరోగ్య జాగ్రత్తల గురించి వివరించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు ఉన్నారు.

Comments

G
Loading comments...