Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారులకు తల్లిపాలు తాగించాలి

Follow Udayam on Google
p.g.murthy Aug 01, 2026 3:31 PM మంచిర్యాలGeneral
చిన్నారులకు తల్లిపాలు తాగించాలి - Udayam
చిన్నారులకు తల్లిపాలు తప్పకుండా తాగించాలని జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి హెల్త్ అసిస్టెంట్ కొల్లూరి కమలాకర్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా శనివారం జన్నారం మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు తల్లి పాలు బిడ్డకు ఇస్తే నిమోనియా, నీళ్ళ విరోచనాలు వ్యాధులకు గురి కాకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూతిరామయ్య, ఏఎన్ఎం మాధవి, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...