Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

Follow Udayam on Google
B RAJESH Aug 26, 2026 7:40 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు - Udayam
చీపురుపల్లి మూడు రోడ్డు జంక్షన్ వద్ద బుధవారం సాయంత్రం ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 5 వాహనాలకు జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారులు విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి లేదా మత్తు పదార్థాలు రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.

Comments

G
Loading comments...