Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చీపురుపల్లిలో కార్టన్ సెర్చ్ నిర్వహించిన సీఐ

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 12:47 PM విజయనగరంGeneral
చీపురుపల్లిలో కార్టన్ సెర్చ్ నిర్వహించిన సీఐ - Udayam
విజయనగరం జిల్లా చీపురుపల్లి CI శంకర్ రావు ఆద్వర్యంలో ముగ్గురు ఎస్ఐలు, 30 మంది పోలీసులతో 8 బృందాలుగా శుక్రవారం చీపురుపల్లి లోని రెల్లి వీధి, పాత కుమ్మరి వీధి, పాత హరిజన వీధిలో ఆకస్మిక కార్టన్‌ అండ్‌ సెర్చ్‌ నిర్వహించారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా సుమారు 300 ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టినట్లు సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...