వార్తలకు తిరిగి వెళ్లండి

బాల్య వివాహాలు బాలికల ఉజ్వల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. గిరి శిఖర గ్రామాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతుండటంతో బాలికలు చదువుకు దూరమవుతున్నారు. చిన్న వయసులో గర్భం దాల్చడం తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చిన్న వయసులో గర్భధారణతో రక్తహీనత, అధిక రక్తస్రావం, ప్రసవ సమయంలో ప్రాణాపాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. బాల్యవివాహాలపై గ్రామాల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది.
Comments
Loading comments...

