Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం

Follow Udayam on Google
రవళి దేవి Aug 03, 2026 2:51 PM సంగారెడ్డిGeneral
చిట్టీల పేరుతో రూ.2 కోట్ల మోసం - Udayam
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో చిట్టీల పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన చోటుచేసుకుంది. బీఎస్‌ఆర్‌ కాలనీలో శిరీష, సాంబశివరావులు పలువురి నుంచి డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపించారు. గడువు పూర్తయినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దంపతుల కోసం గాలింపు చేపట్టారు.

Comments

G
Loading comments...