Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

CHC లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 11, 2026 12:41 PM విజయనగరంGeneral
CHC లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి CHC లో డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబేద్కర్‌ పోరాట సమితి అధ్యక్షుడు సారు సాంబయ్య, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు లంక సత్యం, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్‌ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...