వార్తలకు తిరిగి వెళ్లండి

మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో (కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం) అడవి కుక్కలుగా పిలిచే 'రేచుకుక్కలు' సంచరిస్తూ కనిపించాయి. చూడటానికి సాధారణ పెంపుడు కుక్కల్లా కనిపించినప్పటికీ.. ఇవి గుంపులుగా దాడి చేస్తే పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే.
ఈల వంటి చిన్న శబ్దాలతో ఒకదానికొకటి సమాచారం ఇచ్చుకుంటూ వేటాడటం వీటి ప్రత్యేకత. గత వందేళ్లలో భారతదేశంలో వీటి సంఖ్య 60% తగ్గిపోగా, తాజాగా ఇవి జన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం. రామ్‌మోహన్ కెమెరా కంటికి చిక్కాయి.
Comments
Loading comments...

