వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లపల్లి మండలం పాగోలు గ్రామపంచాయతీ పరిధిలోని శివారు లంకతోటలో రోడ్లు అధ్వానంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు బురదమయమయ్యాయి. గురువారం ఓ వ్యక్తికి జ్వరం రావడంతో 108 వాహనం గ్రామంలోకి రాలేకపోయింది.
దీంతో కుటుంబ సభ్యులు అతడిని మంచంపై ఉంచి బయటకు తీసుకొచ్చారు. గ్రామానికి రోడ్డు వేయాలని ఎమ్మెల్యేను స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

