వార్తలకు తిరిగి వెళ్లండి

నార్సింగి మండలం శంకాపూర్‌లో శనివారం రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మహిళా ధైర్యం, సామాజిక సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని రజక సంఘం నాయకులు పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

