వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాల్కల్ మండలం హద్నూర్‌లో శనివారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు మల్లేష్ గంగ్వార్ మోడీ గ్రామస్థులతో కలిసి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆమె త్యాగాలను స్మరించుకుంటూ, ఆశయాలను భావితరాలకు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

