వార్తలకు తిరిగి వెళ్లండి

చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లిలో నూతనంగా నిర్మించిన దుర్గామాత, పోచమ్మ ఆలయాల విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. సర్పంచ్ మనీలా నరహరి రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజల్లో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కాలే యాదయ్య పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు.
గ్రామం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
Comments
Loading comments...

