వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లాలో చెరువుల పరిరక్షణ, ఆక్రమణలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు.
పుట్టపర్తి కలెక్టరేట్‌లో వాల్టా కమిటీ సమావేశంలో నివేదికలను సమీక్షించారు. సరైన వివరాలు లేని నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి తదుపరి సమావేశానికి ఖచ్చితమైన నివేదికలు ఇవ్వాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

