Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెరువుగా మారిన ప్రధాన రహదారి

Follow Udayam on Google
P. G. Murthy Sep 25, 2026 10:33 AM మంచిర్యాలGeneral
జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వరద నీటితో చెరువుగా మారడంతో ప్రజలు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం రాత్రి నుండి జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో భారీ నుండి అతి భారీ వర్షం కురుస్తోంది. మండల కేంద్రమైన జన్నారంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వరద నీరు ప్రధాన రహదారితో పాటు కాలనీల రోడ్లపై వస్తోంది. దీంతో రోడ్డుపై వెళ్లేందుకు వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...