Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి

Follow Udayam on Google
Kiran Sep 07, 2026 3:59 PM వనపర్తిGeneral
ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి - Udayam
పానగల్ మండలంలో గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ కురుమయ్య గారు సూచించారు. సోమవారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన సమావేశంలో పలు సూచనలు చేశారు. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు డీజేలు, లౌడ్‌స్పీకర్లు నిషేధమని తెలిపారు. మండపాలకు పోలీస్ పోర్టల్‌లో అనుమతి తప్పనిసరని, సీసీ కెమెరాలు, నాణ్యమైన వైరింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...