వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లాలో కొత్త పింఛన్ల కోసం చేయూత దరఖాస్తులకు భారీ స్పందన లభించింది. 10మండలాల నుంచి మొత్తం 4,239 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 2,704 మంది వితంతువులు, 888 మంది వికలాంగులు, 491మంది ఒంటరి మహిళలు, 107మంది గీత కార్మికులు, 49మంది చేనేత కార్మికులు ఉన్నారు.
ఈ నెల 25లోగా వెరిఫికేషన్ పూర్తిచేసి, కలెక్టర్ ఆమోదంతో అర్హులకు మంజూరు కానున్నాయి.
Comments
Loading comments...

