Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్లూరులో యాదవుల స్మశాన వాటికకు సీసీ రహదారి

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 4:20 PM ఖమ్మంGeneral
కల్లూరులో యాదవుల స్మశాన వాటికకు సీసీ రహదారి - Udayam
కల్లూరు మున్సిపాలిటీ 5వ వార్డు ఏకలవ్యనగర్‌ సమీపంలోని యాదవుల స్మశాన వాటికకు సీసీ రహదారి పనులు ప్రారంభమయ్యాయి. ఎన్నో ఏళ్లుగా రహదారి లేక మృతదేహాలను తరలించేందుకు ఇబ్బందులు పడుతున్న యాదవుల సమస్యకు పరిష్కారం లభించింది. వైస్‌ చైర్మన్‌ శీలం కోటేశ్వరి కృష్ణారెడ్డి ప్రతిపాదనతో, ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్‌, మంత్రి పొంగులేటి సహకారంతో నిధులు సమకూరాయి. చైర్మన్‌ ధరావత్‌ మోహన్‌నాయక్‌ పనులను ప్రారంభించారు.

Comments

G
Loading comments...