వార్తలకు తిరిగి వెళ్లండి

చౌటుప్పల్ ప్రాంతంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేక ట్రాన్స్ఫార్మర్లు, మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి కరెంటు అందక పంటలు ఎండిపోతున్నాయని దేవలమ్మ నాగారం రైతు మల్లారెడ్డి తెలిపారు.
జనరేటర్లతో మోటార్లు నడిపి పంటలకు నీరందిస్తున్నామని, అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోందని చెప్పారు. అధికారులు స్పందించి విద్యుత్ సరఫరాను సరిచేయాలని కోరారు.
Comments
Loading comments...

