వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరంలోని సుందరయ్య వీధిలో శ్రీ చైతన్య క్లినిక్, బాలాజీ మెడికల్స్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో ఆస్తమా, పిల్లల ఉదర సంబంధిత వ్యాధులు, చర్మ వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు నిపుణులైన వైద్యులు ఉచితంగా పరీక్షలు నిర్వహించారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

